RR: అబ్దుల్లాపూర్ మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ముగ్గురు వ్యక్తులు కళాశాలలోకి ప్రవేశించి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు పక్కా రెక్కీ నిర్వహించిన అనంతరం చోరీ చేసినట్లు తెలుస్తోంది. చోరీ చేసిన అనంతరం కళాశాల వెనుక ఉన్న గుట్ట ప్రాంతం నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
MNCL: కాగజ్ నగర్ డివిజన్ రాస్పల్లి,చెడ్వాయి అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలు ఉన్నాయని అటవీ అధికారులు ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 తర్వాత సాయంత్రం 4 గంటలలోపు పనులు ముగించుకొని ఇళ్లలో ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా అడవికి వెళ్లరాదని, పశువుల కాపరులు అడవికి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పులి కనిపించినట్లయితే సమాచారం అందించాలన్నారు.
KMR: పల్వంచ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ హిమబిందు ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
HNMK: హనుమకొండలోని జేఎన్ఎస్‌లో నేటి నుంచి 15వరకు అండర్-19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్-19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. మొదటి రోజు కొన్ని క్రీడా విభాగాలకు సంబంధించిన క్రీడాకారులను, రెండో రోజు మరికొన్ని, ఈనెల 15న మరిన్ని క్రీడా విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక పోటీలు ఉంటాయన్నారు.
HYD: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం మొదటిరోజు విజయవంతంగా పూర్తయింది. మొదటిరోజే 92 శాతం మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ తెలిపారు. మొత్తం 2,586 పోలియో కేంద్రాలు, 91 మొబైల్ టీమ్స్ ద్వారా 4,75,858 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసామన్నారు.
BDK: తల్లితండ్రుల ఆశయాలను నెరవేచ్చేలా చదువులో విద్యార్థులు ముందంజ వెయ్యాలని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీలత తెలిపారు. ఆదివారం తినబాక మండలం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, భోజన ఏర్పాట్లు పరిశుభ్రత వంటి అంశాలను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
WGL: దుగ్గొంది మండల కేంద్రంలోని మైసంపల్లె గ్రామంలో లంపీ స్కిన్ వ్యాధి వ్యాప్తి తో ఆవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు తెలిపారు. పశువుల శరీరంపై గడ్డలు ఏర్పడి పాలు ఉత్పత్తి తగ్గిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి మరింత విస్తరించకముందే పశువైద్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
MBNR: జడ్చర్ల మండలం కిష్టంపల్లి పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామి నారాయణ స్కూల్ సమీపంలో బైక్‌పై నుంచి పడి, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన బంగారయ్య (26) మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో మారేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: దేవరకొండ మండలం కొమ్మేపల్లిలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కురిసిన వర్షానికి పాఠశాల చుట్టూ వరద చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. దీంతో పాములు, తేళ్లు, విషపురుగులు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. ప్రహరీ గోడ నిర్మించాలని వారు కోరుతున్నారు.
KMR: పోచారం ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం వరద తగ్గుముఖంపట్టింది. ప్రాజెక్టులోకి కేవలం 832 క్యూసెక్కుల వరద వచ్చిందని ప్రాజెక్టు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదలో 742 క్యూసెక్కులు వరద నిజాంసాగర్లోకి పోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 25.805 టీఎంసీల వరద ప్రాజెక్టు నుంచి మంజీరా ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్లిందన్నారు.
PDPL: మంథనిలో RSS శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ విభాగ్ సహ వ్యవస్థ ప్రముఖ్ మాట్లాడుతూ.. RSS 100 ఏళ్లుగా శాఖల ద్వారా వ్యక్తి నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. అనంతరం మంథని పట్టణంలో గాంధీ చౌక్ నుంచి పలు దేవాలయాలు, అంబేద్కర్ చౌక్ మీదుగా పథ సంచలన్ నిర్వహించారు.
ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఇన్‌ఛార్జ్ జాన్సన్ నాయక్‌కు కీలక బాధ్య తలు అప్పగించింది. నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్‌కు వీరిద్దరినీ పలు బూత్‌లకు ఇన్‌ఛార్జీలుగా నియమించింది.
NGL: నల్గొండ హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలు ఆదివారం భక్తుల సందడితో మరింత శోభాయమానమయ్యాయి. సెలవు దినం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా నల్గొండకు పట్టణానికి పోటెత్తారు. దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పరిసరాల్లో ఏర్పాటు చేసిన మేళా దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాయి.
MHBD: జిల్లా కేంద్రంలోని బెస్త బజార్లోని కృష్ణ కాలనీలో ఆదివారం రాత్రి అంగన్వాడీ టీచర్ బానోత్ మాధవి (42) ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరివేసుకొని కనిపించడంతో, స్థానికుల సమాచారం మేరకు టౌన్ సీఐ మహేందర్ రెడ్డి అక్కడికి చేరుకొని ఆమె కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
JGL: వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని భక్తులు దర్శించుకోకుండా నిలిపివేయడంపై కథలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాన్ని మూసివేయించే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.