తెలంగాణ(Telangana)లో సరిపడ కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయని, పరిశ్రమలు పెట్టుకోవడానికి సరైన ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. అమరరాజా యూనిట్ రావడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
పెళ్లి వేడుకలో భాగంగా ఓ బాలుడు(child) ఆడకుంటూ ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. దీంతో ఈ చిన్నారి ఎడమ కంటి దగ్గర గాయమైంది. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆ బాబు తండ్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రగ్స్ ముఠాలోని ఐదుగురిని అదుపులోకి తీసుకున్న SOT పోలీసులు విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయం ఇంజినీరింగ్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని అమ్మకాలు
ఇరాక్‌లో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతదేహాన్ని రప్పించేందుకు మంత్రి కేటీఆర్ చొరవ చూపారు. మృతదేహాన్ని ఇండియాకు చేర్చేందుకు ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని(Tax) తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్ (Liquor)కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు(All Brands Rates) తగ్గనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది.
అదే బాధతో రమ్య పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కూతురును పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తోన్న సిట్‌పై తమకు నమ్మకం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కేటీఆర్ మీద ఈ రోజు ఫిర్యాదు చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య అనేక రోజులుగా ఉన్న వివాదం సమసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య న్యూఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఆంధ్ర భవన్‌లోని ప్రధాన ఆస్తుల విభజనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త ప్రతిపాదనను సూచించగా ఏపీ ఓకే చెప్పింది.
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో ఇద్దరు వ్యక్తులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టైన వారి సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇంకా నిందితులు ప్రశ్నపత్రాలు ఎంత మందికి అమ్ముకున్నారనే వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా మంగలగూడెంలో దారుణం చోటుచేసుకుంది. దహన సంస్కారాల సమయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఏర్పాట్లు చేస్తుండగానే మా భూమిలో పెట్టొద్దని ఘర్షణ జరిగింది. అంతేకాదు ఒకరిపై ఒకరు ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో దహన సంస్కారాల కార్యక్రమం ఆగిపోయింది. అచ్చం బలగం మూవీలో మాదిరిగా మా భూమిలో సమాధి కట్టవద్దని అన్నదమ్ములు గొడవ పడినట్లుగా ఈ సంఘటన ఉంది.
సొంత ఊరు, ఉన్న ఇంటిని వదిలి వెళ్లాలనిపించలేదు. దీంతో వెంకటయ్య ఈనెల 2న మంగళవారం గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో బస చేశారు. అక్కడ తన పరిస్థితి చెప్పి బాధపడ్డారు. తెల్లవారుజామున బుధవారం (మే 3)న నవాబుపేటకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లారు.