హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్(hyderabad rangareddy mahabubnagar) ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల(elections) నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో మూడు రోజులు మద్యం దుకాణాలు(Liquor shops) బంద్ పాటించనున్నాయి. మార్చి 11న సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు(wine shops) బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
కవిత వ్యవహారాన్ని మొత్తం తెలంగాణపై దాడిగా ఆపాదించేందుకు సిద్ధమైంది. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించనుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కవిత ఈడీ విచారణ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఇవాళ జరిగిన బీఆర్ఎస్ (BRS) విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ (CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో (Telanagna) భూ సమస్యలు అనేకము ఉన్నాయని, వాటి పరిష్కారానికి పంచ సూత్రలను కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) అన్నారు.119 నియోజక వర్గాలలో గ్రామాల్లో ధరణి అదాలత్ (Dharani Adalat) కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు.
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha)కు ఈడీ నోటీసులు పంపడంపై సీఎం కేసీఆర్(CM KCR) ఎట్టకేలకు స్పందించారు. కవిత అరెస్టుకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు కవిత(Kavitha)ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. ఒక వేళ అరెస్టు చేసుకుంటే చేసుకోనీ అని, అందర్నీ బీజీపీ ఇలానే వేధిస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి భయపడేది లేని, పోరాటం వదిలేది కూడా లేదని సీఎం కేసీఆర్...
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) తీవ్రంగా ఖండించారు. ఇంటి దొంగలే శిఖండిలా మారి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. జరిగిన విషయాలన్ని సీఎం కేసీఆర్ (Cm kcr) దృష్టికి తీసుకెళ్తానని అన్ని విషయాలను వివరిస్తానని రాజయ్య అన్నారు.
CM KCR ON PRE POLL:లిక్కర్ స్కామ్‌లో (Liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం (cabinet meeting) నిన్న సమావేశమైన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్‌లో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ విసృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశం తర్వాత పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ (cm kcr) మీడియాతో మాట్లాడారు.
టిట్టర్లో ఆస్క్ కేటీఆర్ (Ask KTR on Twitter)నిర్వహించి నెటిజన్లకు టచ్ లో ఉంటారు మంత్రి కేటీఆర్. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలు ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)వద్ద మెట్రో, బస్సు సర్వీసులు అందుబాటులో లేని సమయంలో అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు క్యాబ్ లేదా ఆటో సర్వీసులు(Cab or auto services) ఏర్పాటు చేయాలని కోరారు.
Hot summer:మార్చి వచ్చింది.. కొన్ని చోట్ల వాతావరణం కాస్త చల్లగా ఉన్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఎండ వేడిమి ఉంది. ఉదయం 10 దాటితే చాలు భానుడి భగ భగలు కొనసాగుతున్నాయి. దైవభూమి కేరళలో రికార్డు స్థాయిలో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంది.
Avinash reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి కాస్త ఊరట కలిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆయనను పలుమార్లు సీబీఐ విచారించింది. అయితే ఈ రోజు కూడా విచారించాల్సి ఉంది. ఇంతలో సీబీఐ అధికారుల తీరు గురించి అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
YS Sharmila : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. దేశరాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె దీక్షకు చాలా మంది మహిళలు మద్దతు పలుకుతున్నారు. కాగా... కవిత దీక్ష పై షర్మిల సెటైర్లు వేశారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని..కేసీఆర్ ఇంటి ముందని షర్మిల అన్నారు.
పార్లమెంటులో బీసీ(BC) బిల్లు(Bill) ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని చట్టసభల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు(reservations) కల్పించాలని కోరారు. బీసీ(BC)లకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు అంశంపై ఏప్రిల్ 3న ఢిల్లీ(delhi)లో ధర్నా చేయనున్నట్లు చెప్పారు.
CM KCR : తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అధికారులతో పాటు కొత్త సచివాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం జరుగుతున్న పనులు గురించి ఆరా తీశారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం అభినందనీయం. మహిళా సమస్యలపై పోరాడుతున్న తీరు భేష్. తెలంగాణ మహిళలకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వాలి.
మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women's Reservation Bill) కోసం ఢిల్లీ (New Delhi)లో కవిత దీక్ష చేస్తుండగా ఆమెకు పోటీగా హైదరాబాద్ (Hyderabad)లో బీజేపీ ‘మహిళ గోస- బీజేపీ భరోసా దీక్ష’ అనే కార్యక్రమం చేపట్టింది. హఠాత్తుగా ఈ దీక్ష పెట్టడానికి కారణం కవిత దీక్షను దారి మళ్లించేందుకు, హైప్ తగ్గించేందుకు చేసినట్లు తెలుస్తోంది.