BDK: మహిళలు తమ హక్కుల సాధనకై పోరాటాలు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి జ్యోతి అన్నారు. శనివారం కొత్తగూడెం సీపీఎం పార్టీ కార్యాలయంలో ఐద్వా జిల్లాస్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. మహిళలకు దక్కాల్సిన హక్కులను పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు.
BDK: కొత్తగూడెం పట్టణంలో శనివారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ గయాల్ పాల్గొని మాట్లాడారు. రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్య మించాలని అన్నారు.
HYD: ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు మేడ్చల్ జిల్లాలోని నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం. రాధిక తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి 18 నుంచి 21 ఏళ్ల వయస్సు కలవారు అర్హులన్నారు. https:// agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో జనవరి 7 నుంచి 27 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు.
ADB: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సీఆర్టీలకు మద్దతుగా శనివారం మండల కేంద్రంలోని సీఆర్టీలు నిర్వహిస్తున్న సమ్మెకు ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు రాథోడ్ రితిష్, నాయకులు కొండెరి రమేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
జనగామ: పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో కొనసాగుతోన్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే సరళిని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల పూర్తి వివరాలను సేకరించి, యాప్‌లో సక్రమంగా నమోదు చేయాలని, ఎటువంటి అలసత్వం వహించరాదని, అవసరమైన భూమి పత్రాలు, కరెంట్ బిల్లు, వంటి వాటిని సరైన విధంగా పరిశీలించి పొందుపరచాలని సూచించారు.
JGL: శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో శనివారం పోలీస్ స్టేషన్ల పనితీరుపై, నమోదైన కేసులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రవీంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.
SRPT: మట్టంపల్లి మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. డివిజన్ నాయకులు రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సరైన మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకునాణ్యమైన భోజనం అందించాలని మంచినీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు.
SRD: సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగుల కోసం 7వ తేదీన సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శనివారం తెలిపారు. శిబిరంకు సంబంధించిన స్లాట్ ఈనెల 31వ తేదీన విడుదల చేస్తామని పేర్కొన్నారు. మీ-సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
WGL: నిర్దిష్ట గడువులోగా ఎఫ్ఎస్ టీపీ పనులు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. వరంగల్ నగర పరిధికి సంబంధించి స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
SRPT: చివ్వెంల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి జీ. విశాల్ (10వ తరగతి) రాష్ట్రస్థాయి సీఎం పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలో ఈ నెల 31 నుంచి వచ్చేనెల 2 వరకు జరగబోయే రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనబోతున్నట్లు తెలిపారు. పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
BDK: వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యునిస్టు పార్టీ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మణుగూరులో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభలో మాట్లాడారు. కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, పేదల హక్కుల కోసం పోరాటం చేసింది కమ్యునిస్టు పార్టీ అని, భారత దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని ఆయన కోరారు.
SRPT: రోడ్ల భద్రతపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. గత నెలలో జరిగిన సమావేశంలో జిల్లాలోని అన్ని జాతీయ రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్‌పై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
SDPT: చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో హైనా దాడిలో లేగ దూడ తీవ్రంగా గాయపడింది. రైతు గాజుల కిష్టయ్య తెలిపిన వివరాలిలా.. లేగ దూడను తన వ్యవసాయ క్షేత్రం వద్ద శుక్రవారం కట్టేశారు. మరునాడు ఉదయం వెళ్లి చూసే సరికి తన లేగ దూడ తీవ్ర గాయాల పాలై ఉందన్నారు. హైనా దాడి చేసి ఉంటుందని అనుమానిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు బాధితుడు సమాచారం అందించారు.
BDK: సింగరేణి సంస్థలో పని చేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ సూపర్వైజర్ సుంకర శ్రీనివాసును విధుల నుంచి తొలగించాలని కోరుతూ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలేం రాజుకు శనివారం వినతి పత్రం అందజేశారు. రవీందర్ మాట్లాడుతూ.. సూపర్వైజర్‌గా ఉన్న శ్రీనివాస్ సెక్యూరిటీ గార్డుల పట్ల వివక్షతను చూపిస్తున్నాడని ఆరోపించారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలోని రసాయన శాస్త్ర విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్‌ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పార్థసారథి పర్యవేక్షణలో “సింథసిస్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ కాంప్లెక్స్” అనే అంశంపై జ్ఞానేశ్వర్ PHD పూర్తి చేశారు. దీంతో పాలమూరు యూనివర్సిటీ బీసీ అధ్యాపకులు జ్ఞానేశ్వర్‌ను ఘనంగా సత్కరించారు.