»New Secretariat To Open On 30th April Mesha Lagnam
mesha lagnam సుముహూర్తాన కొత్త సచివాలయం ప్రారంభం
New secretariat open on mesha lagnam:కొత్త సచివాలయ (secretariat) నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చేనెల 30వ తేదీన మేష లగ్న (mesha lagna) సుముహూర్తన సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 06.08 గంటలకు వేద పండితుల సమక్షంలో సీఎం కేసీఆర్ (cm kcr) ప్రత్యేక పూజలు చేస్తారు.
New secretariat open on mesha lagnam:కొత్త సచివాలయ (secretariat) నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చేనెల 30వ తేదీన మేష లగ్న (mesha lagna) సుముహూర్తన సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 06.08 గంటలకు వేద పండితుల సమక్షంలో సీఎం కేసీఆర్ (cm kcr) ప్రత్యేక పూజలు చేస్తారు.
మధ్యహ్నాం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ (cm kcr) తన సీటులో ఆశీనులు అవుతారు. మధ్యాహ్నాం 1.30 గంటల నుంచి 3.30 గంటల మధ్య మంత్రులు (ministers) సీట్లలో కూర్చుంటారు. కొత్త సచివాలయానికి సంబంధించి ఇప్పటికే త్రిడి యానిమేషన్ (3d animation) వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయ నిర్మాణం కోసం రూ.400 కోట్లు (400 crores) అని తొలుత అనుకున్నారు. కానీ నిర్మాణ వ్యయం క్రమంగా పెరుగుతుంది. రూ.1200 కోట్లకు (1200 crores) నిర్మాణ వ్యయం పెరిగింది. సచివాలయాన్ని షాపూర్జీ పల్లొంజి సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
ఆరు ఫ్లోర్లు.. ఆరు లక్షల చదరపు అడుగుల్లో సెక్రటేరియెట్ నిర్మాణానికి రూ.400 కోట్లు అవుతుందని అంచనా వేశారు. టెండర్ల సమయంలో అది పెరిగి రూ.494 కోట్లకు చేరింది. షాపూర్జీ పల్లోంజీ 4 శాతం ఎక్కువగా రూ.514 కోట్లు కోట్ చేసి టెండర్ ప్రక్రియలో ఎల్-1గా నిలిచింది. కొద్ది రోజులకే మరోసారి అంచనాలని పెంచాల్సి వచ్చింది. ఒక ఫ్లోర్ పెరిగిందని, ఇంకో లక్ష చదరపు అడుగులకు అంచనా వ్యయం రూ.219 కోట్లు అవుతుందని వ్యయం రూ.619 కోట్లకు పెంచారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్ ధరలు పెరిగినందున నిర్మాణ ఖర్చు రూ.800 కోట్లు అవుతుందన్నారు. తర్వాత అది మళ్లీ రూ.వెయ్యి కోట్లకు చేరుకుంది. అలా చివరికీ రూ.1200 కోట్లకు చేరింది.
సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టారు. అంబేద్కర్ జయంతి రోజున (ఏప్రిల్ 14వ తేదీన) సచివాలయం ప్రారంభించాలని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం కూడా తొలుత ఓకే అని.. చివరికు ఏప్రిల్ 30వ తేదీని ఖరారు చేసింది. అంతుకుముందు కేసీఆర్ జన్మదినం అయిన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించాలని అనుకున్నారు. అదీ కూడా క్యాన్సిల్ కాగా.. చివరగా ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభిస్తున్నారు.