సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విజయ్వర్ధన్ను బెదిరించి డబ్బులు కాజేశాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై కేసు నమోదైంది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
Kannarao: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అతనిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్‌హౌస్‌లో నిర్భంధించి దాడి చేశారని కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అతనితో పాటు మరో అయిదుగురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ సమస్య పరిష్కారం కోసం కన్నారావు వద్దకు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విజయవర్ధన్ రావు వెళ్లారు.
కన్నారావుకు తెలిసిన నందిని అనే మహిళ విజయవర్ధన్ వద్ద నగలు, నగదు ఉన్నాయనే విషయం తెలిపింది. దీంతో ఆ మహిళతో పాటు మరికొందరితో కలిసి కన్నారావు విజయవర్దన్ రావును గెస్ట్ హౌస్‌లో నిర్భంధించాడు. బెదిరించి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడు. అలాగే తనకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసు అని కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.