»Huge Increase In Haleem Biryani Orders In Hyderabad
Swiggy : హైదరాబాద్లో భారీగా పెరిగిన హలీం, బిర్యానీ ఆర్డర్లు
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఇవ్వాల (శుక్రవారం).. ఈ నెల రంజాన్ సందర్భంగా హైదరాబాద్లోని ప్రజలు ఆర్డర్ చేసిన డిష్ ల గురించి ఒక ఆర్డర్ అనలైటిక్ నివేదికను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది
రంజాన్ (Ramadan) మాసం వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad) లో ఎక్కడ చూసినా హలీం స్పాట్లే కనిపిస్తాయి. బిర్యానీతోపాటు హలీంను కూడా హైదరాబాదీలు అంత ఇష్టంగా తింటారు. ఈసారి కూడా హలీం (Halim) ఎక్కువగా అమ్ముడవుతోందట. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) ఆర్డర్ అనాలసిస్ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే, హైదరాబాదీలు 10 లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీంలు ఆర్డర్ చేశారు. ఈ లెక్క చూస్తుంటే.. నెల రోజులుగా భాగ్యనగర వాసులు ఫ్యామిలీ ఫ్యామిలీ (Family) బిర్యానీ, హలీం తినేసింది అనటానికి ఇదే సాక్ష్యం. గత ఏడాదితో పోల్చితే ఇది 20 శాతం అదనం కావటం మరో విశేషం.
ప్రతి ఏటా హైదరాబాద్ లో హలీం సేల్స్ భారీగా పెరగటం చూస్తుంటే.. రంజాన్ నెల కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది డిసైడ్ అయిపోతుంది. రంజాన్ నెలలో ఫుడ్ ఆర్డర్స్ (Food orders) పై స్విగ్గీ రిలీజ్ చేసిన డేటా షాకింగ్ గా ఉంది. ఒక్క హైదరాబాద్ సిటీ, సిటీ శివార్లను పరిగణలోకి తీసుకుంటే.. రంజాన్ మాసంలో వన్ మిలియన్.. అంటే 10 లక్షల బిర్యానీ ఆర్డర్స్ బుక్ అయ్యాయి. 4 లక్షల హలీం ఆర్డర్స్ వచ్చాయిం. మొత్తం 350 రెస్టారెంట్ల నుంచి 50 శాతం ఆర్డర్స్ రాగా.. ఇందులో పిస్తా హౌస్(Pistachio House) హలీం టాప్ పొజిషన్ లో ఉంది. ఇక బిర్యానీ ఆర్డర్స్ లో ప్యారడైజ్(Paradise), మెహఫిల్ హలీంలో చాలా రకాలు ఉన్నా.. మటన్ హలీం వాటా 77 శాతంగా ఉంది. ఆ తర్వాత చికెన్ హలీంను ఫేవరేట్ గా ఆర్డర్ చేశారు హైదరాబాదీలు. రంజాన్ నెలలో డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ సైతం భారీగా ఆర్డర్స్ వచ్చాయని.. మెజార్టీ మాత్రం హలీం, బిర్యానీ(Biryani) నిలిచిందని స్పష్టం చేసింది స్విగ్గీ. 2023, మార్చి 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు డేటా ఇది. మిగతా ఐదు రోజుల్లో ఇంకెన్ని లక్షల ఆర్డర్స్ చేశారో జనం..ఫేవరేట్ గా నిలిచింది.