VKB: ధరూర్ మండలం నాగసముందర్కు చెందిన ఉపాధ్యాయురాలు ఎం.సరిత న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రెయినింగ్ (సీసీఆర్టీ)లో 15 రోజుల పాటు శిక్షణ పొందారు. డైరెక్టర్ చేతుల మీదుగా ఆమె బుధవారం అవార్డు అందుకున్నారు. వికారాబాద్ జిల్లా నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు సరిత కావడం విశేషం. ఆమెను కుటుంబ సభ్యులు అభినందించారు.