NGKL: అమ్రాబాద్ మండలం తిర్మలాపురం గ్రామానికి చెందిన అమరేందర్ షూటింగ్ బాల్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు షూటింగ్ బాల్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి రాఘవేందర్ సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా రాఘవేందర్ మాట్లాడుతూ.. ఈనెల 17,18,19 తేదీలలో ఒడిస్సా రాష్ట్రంలో జరిగే షూటింగ్ బాల్ టోర్నీలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.