»Etala And Rajagopal Reddy Not Attend Intintiki Bjp Programme
Intintiki BJP ప్రోగ్రామ్‌కు ఈటల, రాజగోపాల్ రెడ్డి డుమ్మా..? కారణమిదేనా..?
ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి ముఖ్య నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో ఆ పార్టీలో ఏం జరుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి.
Etala And Rajagopal Reddy Not Attend Intintiki BJP Programme
Intintiki BJP: ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని ఈ రోజు కమలదళం చేపట్టింది. దేశవ్యాప్తంగా కార్యకర్తలు, నేతలు ప్రజలను కలిసే కార్యక్రమం ఇది. గత 9 ఏళ్లలో ప్రధాని మోడీ ప్రభుత్వం చేసిన పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలను కలిసి వివరిస్తారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఇంఛార్జీలు పర్యటించాలి. కరీంనగర్లో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హుజురాబాద్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మునుగోడులో బీజేపీ నేత మాత్రం హాజరుకాలేదు. దీంతో ఏం జరిగుతుందా అనే అంశం చర్చకు దారితీసింది.
బండి వర్గం సమావేశం
ఇటీవల బండి సంజయ్ వర్గం సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో ఈటల రాజేందర్ కినుక వహించి ఉంటారు. అందుకే ఈ రోజు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈటల రాజేందర్‌తోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నియోజకవర్గంలో కనిపించలేదు. వీరిద్దరూ దూరంగా ఉండటం చర్చకు దారితీసింది. కావాలనే రాలేదా..? ఎందుకు దూరంగా ఉన్నారనే అంశం పొలిటికల్ సర్కిళ్లలో డిస్కషన్ జరుగుతోంది. మొన్న బండి సంజయ్ వర్గం సమావేశం నిర్వహించడం.. ఆ వెంటనే వీరిద్దరూ కార్యక్రమాలకు హాజరుకాకపోవడం బీజేపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతకుముందు జూపల్లి కృష్ణారావు తమతో కలిసి ఈటల రాజేందర్ కూడా తమ వెంట వస్తారని కామెంట్ చేశారు. రేపో, మాపో జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఆయనతో ఈటల కూడా వస్తారా..? అనే ప్రశ్న వస్తోంది. ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా సొంత గూటికి వెళతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే సోదరుడు వెంకట్ రెడ్డితో చర్చలు జరిపారని.. రేపో, మాపో చేరిక ఖాయమనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ రోజు రాలే.. వస్తారు: బండి
ఈటల, రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండటంపై బండి సంజయ్ స్పందించారు. అదేం లేదని, 30వ తేదీ వరకు ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ఉంటుందని.. ఆ లోపు పాల్గొంటారని కవరింగ్ చేశారు. ఫస్ట్ డే కీలక నేతలు హాజరుకాక పోవడం నెగిటివ్ ఇవ్వదా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఇంకా సమయం ఉంది కదా అని సమాధానం దాట వేశారు. ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలు మాత్రం తిరుగుతున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 వేల బూతులలో బీజేపీ శ్రేణులు కదం తొక్కారని.. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటున్నారని వివరించారు. ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కలిసి తిరుగుతున్నారని వివరించారు. 30వ తేదీ లోపు తిరగకుంటే చర్యలు తీసుకుంటారా అంటే.. అదేం లేదు.. వస్తారు అని వెళ్లిపోయారు.
చేసినవి ఇవీ..?
గత 9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు వివరిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. సాహోసోపేత కార్యక్రమాలు చేపట్టిందని వివరిస్తున్నాని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 30 లక్షల మందిని కలువాలనే టార్గెట్ పెట్టుకున్నామని.. ఇప్పటికే 10 లక్షల మందిని కలిశామని తెలిపారు.