SDPT: హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువును శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని, భూసేకరణకు రైతులు సహకరించాలని కోరారు. ఎల్లమ్మ చెరువును రూ.15 కోట్లతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పనులు పూర్తయిన తర్వాత పీజీ కాలేజీ వస్తుందని వెల్లడించారు.