MLG: ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో భక్తులకు దిశానిర్దేశం చేసే ప్రధాన ఆర్చ్ రాజకీయ ఫ్లెక్సీలతో కప్పిపుచ్చడంతో కనిపించకుండా పోయింది. దీంతో భక్తులు దారి తప్పి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి రవాణా అంతరాయం కలుగుతోంది. ఈ నిర్లక్ష్యం అధికారులదేనని భక్తులు విమర్శిస్తున్నారు.