ADB: ఉట్నూర్ మున్నూర్ కాపులు ఓ పేద కుటుంబానికి అండగా నిలిచారు. మండల కేంద్రంలోని అదే కులానికి చెందిన పెండెం సత్యన్న ఇటీవల మృతి చెందగా..వారిది నిరుపేద కుటుంబం కావడంతో ఉట్నూర్ డివిజన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి రూ.10500 నగదుతో పాటు 50 కిలోల బియ్యం అందించి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో కోల సత్యన్న, గొర్రెల రాజమౌళి, తదితరులున్నారు.