WNP: కొత్తకోట మండల కేంద్రంలో గురులయ్య అబిద్ హుస్సేన్ ఆశ్రమ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ముస్లిం సోదరులు నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సర్వమతాల సారాంశం ఒక్కటేనని, నియోజకవర్గంలో సామరస్య పూర్వక వాతావరణాన్ని కాపాడతానని హామీ ఇచ్చారు.