KMM: ఖమ్మం రైల్వేస్టేషన్లో కృష్ణా, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌లు వచ్చే సమయం కావడంతో ప్లాట్ ఫాంలపై ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. అప్పటివరకు అందరితో కలిసి ఉన్న యువకుడు (28) పట్టాలపైకి దిగి వేగంగా వెళ్తున్న గూడ్స్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుడిచేయిపై త్రిశూలం టాటూ ఉందని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.