SRD: 3నెలలకు ఒకసారి ఈవీఎంలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం పాత డీఆర్డీఏలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్లో సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లు, తదితర సౌకర్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈవీఎంలకు పోలీసుల భద్రత కల్పించినట్లు చెప్పారు.