»Duddilla Sridhar Babu Pv Narasimha Rao Record Broken 5 Times Mla
Duddilla sridhar babu: పీవీ నరసింహరావు రికార్డును బ్రేక్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అరుదైన రికార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యే చిత్తు చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన రికార్డును మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్లు శ్రీధర్ బాబు బ్రేక్ చేశారు.
duddilla sridhar babu PV Narasimha Rao record broken 5 times mla
తెలంగాణలో ఇటివల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్లు శ్రీధర్ బాబు(duddilla sridhar babu) సరికొత్త రికార్డు సృష్టించారు. మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈ ఎమ్మెల్యే వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి.. గతంలో నాలుగుసార్లు ఇదే మంథని నుంచి ఎమ్మెల్యేగా గెల్చిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు(PV Narasimha Rao) రికార్డును బ్రేక్ చేశారు. గతంలో 1957, 1962, 1967, 1972 ఎన్నికల్లో పీవీ వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక మంథని నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009, 2018, 2023 సంవత్సరాల్లో శ్రీధర్ బాబు విజయం సాధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పాత రికార్డును చిత్తు చేశారు.
ఇక మంథని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 ఫలితాల్లో INCకి చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు 103822 ఓట్లు సాధించగా.. BRSకి చెందిన పుట్టా మధుకర్‌కు 72442 ఓట్లు వచ్చాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో, INCకి చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మొత్తం పోలైన ఓట్లలో 9.19% ఓట్లతో 16,230 తేడాతో TRSకి చెందిన పుట్టా మధుకర్(putta madhu)పై విజయం సాధించారు. ఈ సీటులో 2018లో INCకి 50.41% ఓట్ల వాటా ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో మొత్తం 2,30,306 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,13,828 మంది పురుషులు, 1,16,458 మంది మహిళలు, 20 మంది నమోదైన ఓటర్లు థర్డ్ జెండర్ ఉన్నారు.