HYD: తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద వ్యాపార కేంద్రమైన బేగం బజార్లో నిత్యం రూ. కోట్లలో లావాదేవీలు జరుగుతాయి. ఇక్కడ గుండుసూది నుంచి బంగారు ఆభరణాల వరకు అన్నీ లభిస్తాయి. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ప్రాంతంలోని కూడలి వద్ద సుమారు 10 అడుగుల ఎత్తులో ‘ఛత్రి’ని నిర్మించారు. ఈ ప్రాంతం ఇప్పటికీ ‘బేగంబజార్ ఛత్రి’గానే సుపరిచితం.