MDK: చలి తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్ పల్లి ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. ప్రదీప్ రావు సూచించారు. ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రావొద్దని సూచించారు. ఎవరైనా వ్యాధుల బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.