MDK: నిజాంపేట్ మండల పరిధిలోని రామ్ రెడ్డి పేట్ గ్రామానికి చెందిన పార్వతి ఆసుపత్రి వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.24వేల చెక్కును శనివారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. అధికారం ఉన్న లేకున్న ప్రజల కోసమే పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్ పాల్గొన్నారు.