»Celebrities Attended To Formula E Racing In Hyderabad
Formula E Racing : ఫార్ములా ఈ రేసింగ్‌కు ప్రముఖులు.. సచిన్, యష్ సందడి
నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లస్ రోడ్లో ఈ రేస్ ను నిర్వహించారు. ఈ రేస్ కోసం గత మూడు నాలుగు రోజుల నుంచే ఏర్పాట్లను చేశారు. ఈ రేస్ ఇవాళ జరిగింది. 25 పాయింట్లతో జా ఎరిక్ వా అనే రేసర్ తొలి స్థానంలో నిలిచాడు
Formula E Racing : హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ఘనంగా జరిగాయి. నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లస్ రోడ్లో ఈ రేస్ ను నిర్వహించారు. ఈ రేస్ కోసం గత మూడు నాలుగు రోజుల నుంచే ఏర్పాట్లను చేశారు. ఈ రేస్ ఇవాళ జరిగింది. 25 పాయింట్లతో జా ఎరిక్ వా అనే రేసర్ తొలి స్థానంలో నిలిచాడు. ఫార్ములా ఈ రేస్ ను చూడటానికి పలువురు ప్రముఖులు హైదరాబాద్ కు క్యూ కట్టారు.
సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కూడా ఈ రేస్ ను చూడటానికి భాగ్యనగరానికి విచ్చేశారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్ ఈ రేస్ కు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖుల్లో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎంపీ గల్లా జయదేవ్ హాజరు కాగా.. సినీ ప్రముఖుల్లో కేజీఎఫ్ స్టార్ యష్, రామ్ చరణ్, నాగార్జున, సిద్ధు జొన్నలగడ్డ, పవన్ కళ్యాన్ కొడుకు అకీరా, నమ్రతా శిరోద్కర్. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తదితరులు హాజరయ్యారు.
Formula E Racing : రేస్ లో పాల్గొన్న 22 మంది రేసర్లు
ఈ రేసులో 22 మంది రేసర్లు పాల్గొన్నారు. 2.8 కిమీల స్ట్రీట్ సర్క్యూట్ లో ఈ రేస్ జరిగింది. ఈ రేస్ కు రావడం చాలా ఆనందంగా ఉందని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. సచిన్ తో పాటు ఆనంద్ మహీంద్రాను కూడా ఆయన కలిశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, కొడుకు గౌతమ్, ఇతర సినీ ప్రముఖులు పాల్గొని ఈ రేసింగ్ ను ఎంజాయ్ చేశారు. రయ్ మంటూ దూసుకెళ్తున్న కార్లను చూసి సందడి చేశారు.
What a brilliant race!
Was quite thrilled to watch @MahindraRacing at Formula E today along with the master blaster @sachin_rt !