NRML: ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. జిల్లాలో 1,665 ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరించాలని అన్నారు.