JGL: జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.