WGL: ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి దేవస్థానంలో నేడు శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.