MBNR:విద్యార్థులకు సరైన భోజనంపెట్టలేని ప్రభుత్వానికి పిల్లల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనలో MBNR ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థులను ఇవాళ మాజీ మంత్రి పరమర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటమాడుతుందన్నారు. మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.