WGL: నర్సంపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా శ్రీనివాస్ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతానని తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, నేరాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.