NLG: జిల్లాలోని అన్నీ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల జాతర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, ‘పనుల జాతర -2025’ లో భాగంగా ఈనెల 22న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రూ.3750.86 లక్షలతో 3918 పనులకు అనుమతులు ఇచ్చినట్లు డీఆర్డీవో వై.శేఖర్ రెడ్డి తెలిపారు.