వనపర్తి: జిల్లాలో సరిపడ యూరియా ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్ అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని అన్నారు. జిల్లాకు 52,856 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ప్రస్తుతం 17,277 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, ఎవరైనా యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.