SRPT: ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.