MLG: మేడారంలో జరిగే క్యాబినెట్ సమావేశంపై అందరి దృష్టి ఉంది. తొలిసారిగా హైదరాబాద్ వెలుపల జరుగుతున్న క్యాబినెట్ సమావేశంపై ఆసక్తి నెలకొంది. మేడారం అడవుల్లో జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేబినేట్ సమావేశం జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.