NLG: చిట్యాల మండలం నేరడ గ్రామంలో రజక సామాజిక వర్గం వారు “మాడిమాల, మాచి దేవుని” బోనాల పండుగను గురువారం వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలను అందంగా అలంకరించి తలపై పెట్టుకుని ఆటపాటలతో గుడి వద్దకు చేరుకున్నారు. దేవతలకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.