MNCL: భీమారం మండల కేంద్రంలోని గోత్రాలగూడెం గ్రామంలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఎస్సై కే.శ్వేత ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల గురించి అవగాహన కల్పించారు.