KMR: రామారెడ్డి మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన గోపు రాములు(46) గల్ఫ్ కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపు రాములు దాదాపు 20 సంవత్సరాల నుంచి గల్ఫ్ కార్మికునిగా బహరన్లో ఉంటూ పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం బాత్రూంలో జారి పడటంతో, గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.