JN: HYD-HNK జాతీయ రహదారిపై జనగామ జిల్లాలోని అధికారుల పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోమల్ల టోల్ గేటుకు అనుసంధానంగా ఉన్న హైవేపై సూచికల బోర్డులు విరిగిపడి ఉన్నా సరిచేసే నాథుడు లేడని, రాత్రి వేళల్లో లైట్లు వెలగట్లేదని మండిపడుతున్నారు. గార్డెన్ మెయింటెనెన్స్ సరిగా నిర్వహించట్లేదని, టోల్ వసూల్ చేసే శ్రద్ధ, రహదారుల మెయింటెనెస్స్పై లేదని వాపోయారు.