NZB: చాత్తాద శ్రీవైష్ణవ సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆర్మూర్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షుడు డీవీఎస్ చక్రవర్తి అన్నారు. పట్టణంలోని రామ్ నగర్ కాలనీలోని సంఘ ప్రహరీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శి ఆసూరి గోవిందరాజస్వామి, సింహయ్య, లింబగిరి స్వామి, ప్రకాష్, సత్యనారాయణ, రవికాంత్ ఉన్నారు.