KMM: నేలకొండపల్లి నుంచి తిరుమలాపురం వరకు సెంట్రల్ లైటింగ్ పనులు ఈనెల 15 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్ పనులపై మార్కెట్ ఛైర్మన్ వెన్నపూసల సీతారాములు, మాజీ ఛైర్మన్ శాఖమూరి రమేష్, నాయకులు కొడాలి గోవిందరావు తదితరులు మంత్రికి వివరించారు. దీంతో మంత్రి అధికారులతో సమావేశమై సూచనలు చేశారు.