NGKL: వెల్దండ మండలానికి చెందిన ప్రముఖ కవి, సాహిత్య వేత్త రుక్మంధర రెడ్డి సోమవారం ఉదయం మరణించారు. నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్య చరిత్రలో రుక్మంధర రెడ్డి పండిత కవిగా పేరుగాంచారు. ఆయన మృతి పట్ల నెలపొడుపు, వెన్నెల, తెలంగాణ సాహితీ సంస్థలు, కవులు సాహిత్య అభిమానులు ప్రగాఢ సంతాపం తెలిపారు. రుక్మంధర రెడ్డి మరణం జిల్లా సాహిత్యానికి తీరని లోటని పేర్కొన్నారు.