BHNG: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. బ్రహ్మోత్సవాల నాటికి విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని, ఇకనుంచి యాదగిరిగుట్టగానే ఆలయాన్ని పిలవాలని, త్వరలో యాదగిరిగుట్ట బోర్డుగా టీటీడీ తరహాలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. గోసంరక్షణకు అవసరమైన టెక్నాలజీ ఉపయోగించుకోవాలన్నారు.