SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం అధికారుల నివేదికలను అడిగి తెలుసుకున్నారు.