NZB: కమ్మర్పల్లి మండలం చౌటుపల్లిలో ఏలేటి మహిపాల్ రెడ్డి 35వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిపాల్ రెడ్డి ఘాట్ వద్ద ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి నివాళి అర్పించారు. మహిపాల్ రెడ్డి సమాధిపై పూలమాలలు వేసి, జ్యోతిని వెలిగించారు.