GDWL: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సుంకులమ్మమెట్టు సమీపంలో ఆదివారం సాయంత్రం గద్వాల పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపిన వివరాలు.. ఎలాంటి అనుమతిపత్రాలు లేకుండా గోనపాడు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మదిలేటి, యజమాని కర్రెప్పలపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు.