ATP: శింగనమల మండలం శివపురం ఎస్సీ కాలనీలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. తాగునీటి సమస్య తీర్చడానికి గతంలో ఆర్డీటీ సంస్థ బోరు వేసింది. దానికి మోటార్ బిగించినా అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ సరఫరా చేయలేదు. దీంతో మోటార్ పని చేయలేదని, విద్యుత్ సరఫరా చేస్తే కాలనీలో నీటి సమస్య పరిష్కారం అవుతుందని మహిళలు తెలిపారు.