MDK: రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణ విషయంలో భూ నిర్వాసితులకు భూ సర్వేలో నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ ధరలకు అనుగుణంగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌తో కలిసి రామాయంపేట బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు.