SRCL: చిన్న పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు తప్పవని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహోజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి 31 తేది వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.