SRCL: వేములవాడ నాంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. నాంపల్లి రూరల్ లైన్లో 11 కేవీ కరెంటు మరమ్మత్తులు జరుగుతున్న దృష్ట్యా విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ ఉండదని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.