NLG: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 4వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో వాత్సల్య సొసైటీ అధ్యక్షులు అంజిరెడ్డి హాజరై వికలాంగులకు పూలమాలవేసి రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల సాధనకై కొనసాగుతున్న దీక్షలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.