MBNR: జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద హైదరాబాద్కు వెళ్లే మార్గంలో రహదారి పై ప్రైవేటు వాహనాలు నిలుపుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. రద్దీ రహదారి కావడం, ఆ ప్రాంతం ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.