NZB: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. అర్బన్ పరిధిలోని 301 పోలింగ్ కేంద్రాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి జాబితా రూపొందించాలన్నారు.