NRML: మహాలక్ష్మీ ఆలయ మూడవ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని అందమైన లైటింగ్, వివిధ రకాల పూలతో అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వార్షికోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు.