WNP: వనపర్తి జిల్లా ఆస్పత్రిలో ఐసీయూ, టెస్టింగ్ యంత్రాలు, పనిచేయక గర్భిణీలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీ హబ్లో ఎలుకలకు పాడైన బయో కెమిస్ట్రీ, థైరాయిడ్ మిషిన్లు తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు టెస్టులకు మళ్ళిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.